స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో అందాల తార టబు ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం. తండ్రీ కొడుకులు అనుబంధం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి 'నాన్న..నేను', 'పార్థు' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు.
అల్లు అర్జున్ సినిమాలో నిన్నే పెళ్లాడతా హీరోయిన్ - త్రివిక్రమ్ శ్రీనివాస్
తెలుగులో అగ్ర హీరోలతో కలిసి నటించిన టబు.. అల్లు అర్జున్ తదుపరి చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అల్లు అర్జున్ తదుపరి చిత్రంలో నటిస్తున్న టబు
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
టబు మొదటిసారిగా 'కూలీనెంబర్ 1' చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది. నాగార్జునతో కలిసి 'నిన్నే పెళ్లాడతా' చిత్రంలో నటించి మెప్పించింది.