తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సుప్రీం కోర్టుకు నాగేశ్వర్​రావు క్షమాపణలు

సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలుపుతున్నానని కోర్టు ధిక్కార నోటీసులపై అఫిడవిట్​ దాఖలు చేశారు సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్​ నాగేశ్వర్​రావు.

సుప్రీం కోర్టుకు నాగేశ్వర్​రావు క్షమాపణలు

By

Published : Feb 12, 2019, 6:20 AM IST

సీబీఐ సంయుక్త డైరెక్టర్​​ ఏకే శర్మ బదిలీ పొరపాటుగా జరిగిందని పేర్కొన్నారు సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్​ నాగేశ్వర్​రావు. ఆ సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ తాత్కాలిక సంచాలకుడిగా నాగేశ్వరరావు ఉన్నారు. సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించలేదని వివరణ ఇచ్చారు.

" నా తప్పును తెలుసుకున్నాను. కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలుపుతున్నా. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు''

-అఫిడవిట్​లో పేర్కొన్న నాగేశ్వర్​రావు

కోర్టు అనుమతులు తీసుకోకుండా జనవరి 17న సీబీఐ డైరెక్టర్​ శర్మను బదిలీ చేశారు నాగేశ్వరరావు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 7న కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details