తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు - Telangana Govt

ఎన్నికలకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... పథకాల పేరుతో నగదు పంపిణీ చేస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

supreme court

By

Published : Jul 2, 2019, 1:47 PM IST

ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక కేంద్రం సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టేందుకు నగదు పంపిణీ, ఉచిత పథకాలను ప్రకటించాయని జనసేన నాయకుడు పెంటపాటి పుల్లారావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్​పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సమధానం ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు పిటిషన్​లో పేర్కొన్న రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం పేరిట కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని.. ఏపీలో పసుపు కుంకుమ పేరుతో మహిళల ఖాతాలో నేరుగా ప్రభుత్వం నగదు జమ చేసిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చాక ఈ నగదు పంపిణీ చేసే పథకాలను ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్​లో పెంటపాటి పుల్లారావు పేర్కొన్నారు. ప్రభుత్వాలు నగద పంచే పథకాలు, ఉచిత పథకాల ప్రకటనకు సమగ్రమైన మార్గదర్శకాలు రుపొందించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనలో కోరారు. ఇలాంటి పథకాలను ఎన్నికలకు కనీసం ఆరు నెలల ముందే ప్రకటించాలని.. లేదంటే ప్రభుత్వ ధనంతో ప్రజలను మభ్యపెట్టేందుకు అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నిస్తున్నాయని పుల్లారావు తెలిపారు.

ఇవీ చూడండి;ప్రియురాలికి చావు పరీక్ష పెట్టిన కిరాతకుడు

ABOUT THE AUTHOR

...view details