తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆ కళాశాలకు విద్యార్థులు రారు.. కానీ పాసవుతారు..! - students

అది ఓ ఐటీఐ కళాశాల. అందులో 600 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. తరగతులకు పదుల సంఖ్యలో వస్తుంటారు. కానీ పరీక్షలు మాత్రం అందరూ రాస్తారు. ఇదెలా సాధ్యమంటే విద్యార్థులకు తామే హాజరువేస్తామంటూ బదులిచ్చారు ఓ అధ్యాపకుడు.

ఐటీఐ కళాశాల

By

Published : Mar 24, 2019, 7:56 AM IST

Updated : Mar 24, 2019, 9:20 AM IST

ఐటీఐ కళాశాల
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాల... జాతీయ వృత్తి నైపుణ్యాల సంస్థ పరిధిలో పనిచేస్తోంది. ఏటా పాలీసెట్ ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందుతున్నారు. తరగతులకు విద్యార్థులు రాకపోయినా... పరీక్షలు రాస్తారు. వారికి అధ్యాపకులు సహకరించడం వల్ల పాసవుతున్నారు. ఇలా ఉత్తీర్ణులైన వారే ఐటీఐ పట్టాలతో బయటకు వస్తున్నారు. నాణ్యమైన చదువు లేక ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు.

కొరవడిన పర్యవేక్షణ..

అడ్మిషన్లు పొందిన నాటి నుంచి ధ్రువపత్రాలు పొందే వరకు విద్యార్థుల వద్ద కళాశాల యాజమాన్యం ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తోంది. వారి గైర్హాజరు కళాశాలకు ఆదాయం తెచ్చిపెడుతోంది. కాలేజీలో తరగతులు జరగకున్నా ఎవరూపట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. యాజమాన్యం ఆడిందే ఆట పాడింది పాట లాగా తయారయింది.

తుప్పుపడుతున్న ప్రయోగపరికరాలు..

600 మంది విద్యార్థులు ఉన్నా... కళాశాల బోసిపోతోంది. ప్రయోగ పరికరాలు తుప్పుపడుతున్నాయి. దశాబ్దం నుంచి ఇదే తంతు కొనసాగుతున్న పట్టించుకొనే నాథుడే లేడు. విద్యార్థుల భవిష్యత్తుప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:తెలంగాణ సీజే జస్టిస్​ రాధాకృష్ణన్ బదిలీ

Last Updated : Mar 24, 2019, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details