తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'వారిద్దరూ కలిసి నటిస్తారనడం వదంతే' - రాజశేఖర్

'విక్రమ్ వేద' తెలుగు రీమేక్​లో కథానాయకులు బాలకృష్ణ, రాజశేఖర్ నటించడం లేదు. ఆ సినిమా హక్కుల్ని ఎవరికీ అమ్మలేదని వై నాట్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ తెలిపింది.

బాలకృష్ణ..రాజశేఖర్ కలిసి నటించట్లేదని తేలింది

By

Published : Mar 22, 2019, 6:03 PM IST

కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, రాజశేఖర్ కలిసి 'విక్రమ్ వేద' రీమేక్​లో నటిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అవన్నీ వదంతులేనని తేలింది. ఆ సినిమా హక్కులు ఎవరికీ అమ్మలేదని, తమ దగ్గరే ఉన్నాయని వై నాట్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రకటించింది.

ప్రెస్ నోట్ విడుదల చేసిన నిర్మాణ సంస్థ

విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన 'విక్రమ్ వేద' తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రతినాయకుడి​గా విజయ్ నటిస్తే, పోలీస్​ అధికారి​ పాత్రలో మాధవన్ కనిపించాడు. టాలీవుడ్​లో ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా రీమేక్​లో వెంకటేశ్, రానా కలిసి నటిస్తారని ఇంతకు ముందు వార్తలొచ్చాయి. కానీ అవి నిజం కాదని తర్వాత తేలింది.

ABOUT THE AUTHOR

...view details