తెలంగాణ

telangana

ETV Bharat / briefs

షేరింగ్​లో మనమే టాప్​ - indians

ఏదైనా విషయం తెలిస్తే చాలు...ఇతరులకు చెప్పేవరకు నిద్ర పట్టదట మన నెటిజన్లకు. ఈ విషయం నిజమని స్పష్టం చేసింది మైక్రోసాఫ్ట్​. నకిలీ వార్తయినా సరే కనీసం ఆలోచించకుండా షేర్​ చేసే విషయంలో భారతీయులు ముందు వరుసలో ఉన్నారు. ఎన్నికల ముందు ఈ గోల మరింత ఎక్కువ కానుందని హెచ్చరిస్తోంది ఈ ప్రఖ్యాత సంస్థ.

షేరింగ్​ కింగ్​లు మనమే

By

Published : Feb 9, 2019, 11:24 AM IST

2019 లోక్​సభ ఎన్నికల్లో నకిలీ వార్తలు విపరీతంగా హల్​చల్​ చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్​ సంస్థ వెల్లడించింది. పుకార్లను షేర్​ చేసే విషయంలో ప్రపంచవ్యాప్త సగటు కన్నా మనమే ముందున్నాం. ఇరవై రెండు దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. భారతీయులు వ్యాప్తి చేస్తోన్న నకిలీ వార్తలు 64 శాతం ఉంటే... ప్రపంచ సగటు 57 శాతమే ఉందట. అంతర్జాలం ద్వారా ఎదురయ్యే సమస్యలు గతంలో 20శాతం ఉండగా తాజాగా 9 శాతం పెరిగి 29కి చేరింది. భారత్​లో సామాజిక బంధాలతో ఇబ్బందులు మరింత పెరగనున్నట్లు వెల్లడించిందీ సర్వే.

అంతర్జాలంతో సతమతమవుతున్న వారి సంఖ్య భారత్​లో 52 శాతానికి చేరింది. ఇది ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ. నిద్రలేమితో బాధ పడేవారి సంఖ్య సైతం ప్రతి ఏడాది పెరుగుతోందని హెచ్చరించారు. ఆన్​లైన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా... పరిష్కారం కోసం మళ్లీ ఇంటర్నెట్​నే ఆశ్రయిస్తున్నారనే ఆసక్తికర అంశాన్నీ వెల్లడించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details