తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కాళేశ్వరంపై భాజపా మాటలు అవగాహనలేనివి - excise minister

ప్రపంచం గర్వించదగ్గ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్​ ప్రారంభించడాన్ని భాజపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ విమర్శించారు. ప్రాజెక్టుపై బీజేపీ నేతల అవగాహనలేని మాటలు తమకు బాధ కలిగిస్తున్నాయన్నారు.

కాళేశ్వరంపై భాజపా మాటలు అవగాహనలేనివి

By

Published : Jun 20, 2019, 7:37 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై భాజపా నేతలు అవహగాహన లేమితో మాట్లాడుతున్నారని ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సొంత డబ్బుతో నిర్మించిందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ ఆ పార్టీ నేతలు తమ వల్లే వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో అన్ని అనుమతులు ఉన్నా అక్కడ ప్రాజెక్టులు ఎందుకు ముందుకు సాగడంలేదని ప్రశ్నించారు. ఫిరాయింపులపై మాట్లాడుతున్న భాజపా నేతలు పశ్చిమ బంగాలో తృణమూల్ నేతలను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి పెట్టి మాట్లాడాలని శ్రీనివాస్ గౌడ్ సవాల్​ చేశారు.

కాళేశ్వరంపై భాజపా మాటలు అవగాహనలేనివి

ABOUT THE AUTHOR

...view details