శ్రీలంకకు ప్రయాణాలు చేయవద్దని పౌరులకు సూచిస్తూ భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే కొలంబోలోని భారత హైకమిషన్, సహాయ కమిషనరేట్లైన కాండీ, హంబన్‌టోట, జాఫ్నా కేంద్రాలను సంప్రదించాలని సూచించింది.
బాంబు పేలుళ్ల అనంతరం దేశంలో అత్యయిక పరిస్థితిని విధించింది శ్రీలంక. అంతర్గత భద్రతను ఆ దేశం కట్టుదిట్టం చేసిందని, రాత్రిళ్లు కర్ఫ్యూ విధించిన కారణంగా ప్రయాణాలు అంత సులభం కాదని వెల్లడించింది.