తెలంగాణ

telangana

ETV Bharat / briefs

టీ20 ప్రపంచకప్​ తర్వాత మలింగ రిటైర్మెంట్

శ్రీలంక పేసర్ లసిత్ మలింగ రిటైర్మెంట్​కు సమయం దగ్గర పడింది. 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్..​ తన చివరి అంతర్జాతీయ టోర్నీ అని తెలిపాడు.

టీ-ట్వంటీ ప్రపంచకప్​ తర్వాత మలింగ రిటైర్మెంట్

By

Published : Mar 23, 2019, 11:16 AM IST

అంతర్జాతీయ క్రికెట్​లో విభిన్న బౌలింగ్ శైలితో ఆకట్టుకున్న మలింగ.. త్వరలో రిటైర్మెంట్ తీసుకోనున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​ తన చివరి అంతర్జాతీయ టోర్నీ అని చెప్పాడీ క్రికెటర్. ఈ సంవత్సరం జరిగే వన్డే ప్రపంచకప్​ తర్వాత 50 ఓవర్ల క్రికెట్​కు స్వస్తి పలకుతానని అన్నాడు.

నా క్రికెట్ కెరీర్ అంతిమ దశలో ఉంది. అందుకే 2020లో జరిగే టీ20 ప్రపంచకప్​ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నాను -లసిత్ మలింగ, శ్రీలంక క్రికెటర్

ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ-ట్వంటీ సిరీస్ ఆడుతోంది శ్రీలంక జట్టు. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్​లో 16 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయారు.

పొట్టి ఫార్మాట్​లో మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు మలింగ. అంతర్జాతీయ టీ20 మ్యాచ్​ల్లో మరో రెండు వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా నిలుస్తాడు. ప్రస్తుతం 98 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది.

ABOUT THE AUTHOR

...view details