తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పుల్వామా దాడిపై బాలీవుడ్​ దిగ్భ్రాంతి - ప్రియాంక చోప్రా, నటి

జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్​​ జవాన్లపై జరిగిన దాడిని బాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. ఈ ఘటనను పిరికిపంద చర్యగా అభిప్రాయపడ్డారు.

పుల్వామా దాడిపై బాలీవుడ్​ దిగ్భ్రాంతి

By

Published : Feb 15, 2019, 3:37 PM IST

బాలీవుడ్​ నటులు అక్షయ్​ కుమార్​, ప్రియాంక, అనుపమ్​ ఖేర్​, అభిషేక్​ బచ్చన్, విక్కీ కౌశల్​​, అర్జున్​ కపూర్​, రితేశ్​ దేశ్​ముఖ్​ వంటి ప్రముఖులు ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.

ఊహించని రీతిలో మన సీఆర్పీఎఫ్​ సైనికులను ఉగ్రవాదులు దెబ్బకొట్టారు. వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. మేము ఈ దాడిని మరిచిపోము తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటాం.
-అక్షయ్​ కుమార్, నటుడు​

ఈ దాడి నా మనసును కలచివేసింది. బాధ్యులను ద్వేషించడం ఒక్కటే సమాధానం కాదు. వేరే విధంగా జవాబు చెప్పాలి. సైనికుల కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి.
- ప్రియాంక చోప్రా, నటి

ఈ రోజు ప్రజలందరూ ఆనందంగా ప్రేమను పంచుకుంటుంటే...ద్వేషాన్ని కూడా పంచాల్సి వస్తుందని ఊహించలేదు. ఆ వీర సైనికుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా.
-అభిషేక్​ బచ్చన్​, నటుడు

పుల్వామా ఘటనను 1989 తరవాత భద్రతా దళాలపై జరిగిన అతిపెద్ద దాడిగా పేర్కొంది రక్షణ శాఖ. శ్రీనగర్​-జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తోన్న సీఆర్పీఎఫ్​​ వాహనంపైకి ఉగ్రవాద ఎస్​యూవీ వాహనం దూసుకెళ్లింది. దీని వల్ల బస్సులో ఉన్న సుమారు 43మంది జవాన్లు వీరమరణం చెందారు.

ABOUT THE AUTHOR

...view details