నేడు అమేఠీలో స్మృతి నామినేషన్- రాహుల్‌తో మళ్లీ ఢీ ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీ లోక్‌సభ స్థానానికి భాజపా నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీనేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా సీనియర్ నాయకుల సమక్షంలో నామపత్రం సమర్పించనున్నారు స్మృతి ఇరానీ.
తొలుత ఈ నెల 17న నామపత్రం దాఖలు చేయాలని నిర్ణయించినప్పటికీ... మహవీర్ జయంతి సందర్భంగా నామినేషన్ తేదీని మార్చుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన అమేఠీలో మరోమారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పోటీపడనున్నారు స్మృతి. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్మృతిఇరానీపై రాహుల్ గాంధీ లక్ష ఓట్లకు పైగా మెజారిటీ సాధించి విజయం దక్కించుకున్నారు.
సాధారణ ఎన్నికల్లో భాగంగా ఐదవ దశలో మే 6న అమేఠీ స్థానానికి పోలింగ్ జరగనుంది.