యూఎస్ ఓపెన్‌కు దూరమైన స్టార్ క్రీడాకారుల జాబితాలో సిమోనా హలెప్ (రొమేనియా) కూడా చేరింది. తాజాగా ప్రేగ్ ఓపెన్‌ను గెలిచి ఫామ్ నిరూపించుకున్న హలెప్.. యూఎస్ ఓపెన్ ఆడుతుందని భావించినా... అనూహ్యంగా తప్పుకుంది. టెన్నిస్ కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె తెలిపింది. హలెప్ ప్రస్తుతం ప్రపంచ రెండో ర్యాంకర్‌గా కొనసాగుతోంది.
యూఎస్ ఓపెన్: ప్రపంచ రెండో ర్యాంకర్ హలెప్ దూరం
ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ నుంచి ఇంకా క్రీడాకారులు వైదొలుతూనే ఉన్నారు. తాజాగా స్టార్ ప్లేయర్ సిమోనా హలెప్ కూడా ఈ ఏడాది పోటీల్లో పాల్గొనట్లేదని స్పష్టం చేసింది. ఆగస్టు 31 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.
"ప్రస్తుతం మనం ఉన్న కరోనా అసాధారణ పరిస్థితులను అంచనా వేసుకుని న్యూయార్క్‌లో జరిగే యూఎస్ ఓపెన్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్నా. ఆరోగ్యానికే నా తొలి ప్రాధాన్యం. అందుకే ఐరోపాలోనే ఉండి ఇక్కడే శిక్షణ కొనసాగించాలని భావించా" అని ఈ వింబుల్డన్ మాజీ ఛాంపియన్ హలెప్ ట్విట్టర్లో తెలిపింది.
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, కిర్గియోస్, మహిళల ప్రపంచ నంబర్ వన్ ఆష్లె బార్టీ లాంటి స్టార్లు ఇప్పటికే ఈ గ్రాండస్లామ్ నుంచి వైదొలిగారు. అభిమానులు లేకుండానే ఈసారి పోటీలను నిర్వహించనున్నారు. ఆగస్టు 31 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది.