తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేను గెలిస్తే గద్వాల నుంచి మాచర్లకు రైల్వేలైన్ - ngkl

అధిష్ఠానం ముందు కీలబొమ్మలా వ్యవహరించే నాయకులను ఎన్నుకోవద్దని కోరారు నాగర్​కర్నూల్ పార్లమెంట్​ అభ్యర్థి బంగారు శ్రుతి. ప్రచారానికి చివరి రోజున ఆమె వనపర్తిలో రోడ్​ షో చేపట్టారు.

వనపర్తిలో బంగారు శ్రుతి రోడ్​ షో

By

Published : Apr 9, 2019, 4:51 PM IST

నాగర్​కర్నూల్ లోక్​సభ అభ్యర్థిగా తనని గెలిపిస్తే గద్వాల నుంచి మాచర్లకు రైల్వేలైన్, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణానికి పాటు పడతానని హామీ ఇచ్చారు బంగారు శ్రుతి. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆమె రోడ్​ షో నిర్వహించారు. తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు అధిష్ఠానాన్ని ఎదిరించి మాట్లాడలేరని విమర్శించారు. సొంత లాభానికి కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక భాజపా నేతలు పాల్గొన్నారు.

వనపర్తిలో బంగారు శ్రుతి రోడ్​ షో

ABOUT THE AUTHOR

...view details