తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'నాగచైతన్యలో నన్ను నేను చూసుకున్నా' - సమంత

'మజిలీ' సినిమాలోని పూర్ణ పాత్రను తన జీవితం ఆధారంగానే రూపొందించానని దర్శకుడు శివ నిర్వాణ తెలిపాడు.

మజిలీలోని నాగచైతన్య పాత్రలో నన్ను నేను చూసుకుంటా అంటున్న దర్శకుడు శివ నిర్వాణ

By

Published : Apr 1, 2019, 3:25 PM IST

'మజిలీ' సినిమాతో మరోహిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ఇప్పటికే 'నిన్ను కోరి' వంటి ప్రేమకథను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. అసలు ఈ 'మజిలీ' ఎలా మొదలైంది అనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.

ప్రేమ, క్రికెట్, పెళ్లి.. నా జీవితంలో ఈ మూడు ప్రధానమైన విషయాలు. నా లైఫ్​లో ఏం జరిగిందనే విషయమే ఈ 'మజిలీ' రూపొందించడానికి కారణమైంది. నా అనుభవాలన్నింటినీ పూర్ణ పాత్ర ద్వారా చూపించాలనుకున్నా. సినిమాలో నటించిన నాగచైతన్యలో నన్ను నేను చూసుకున్నా. -శివ నిర్వాణ, దర్శకుడు

ట్విట్ చేసిన దర్శకుడు శివ నిర్వాణ

నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్.. హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానుల్ని ఆకర్షిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details