ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాము ప్రజాకోర్టుకు వెళ్తామని తెలిపారు. పార్టీ ఫిరాయింపులు మార్చి నుంచి జరుగుతున్నాయని ఆ విషయంలో తాము కోర్టును ఆశ్రయించామన్నారు. పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉండగా ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోన్న కేసీఆర్ వంటి ముఖ్యమంత్రిని గద్దె దించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
న్యాయం కోసం ప్రజాకోర్టుకు వెళ్తాం: షబ్బీర్ అలీ - shabbir ali fires on kcr
కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు.

న్యాయం కోసం ప్రజాకోర్టుకు వెళ్తాం: షబ్బీర్ అలీ