తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఉన్నత విద్యామండలి ఎదుట ఎస్​ఎఫ్ఐ ఆందోళన - higher education

హైదరాబాద్​లో ఇంజినీరింగ్ కళాశాలల రుసుముల పెంపుదలను వ్యతిరేకిస్తూ... ఎస్​ఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నత విద్యామండలి ఎదుట ఆందోళన నిర్వహించారు.

ఉన్నత విద్యామండలి ఎదుట ఎస్​ఎఫ్ఐ ఆందోళన

By

Published : Jun 26, 2019, 8:36 PM IST

ఇంజినీరింగ్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ.. హైదరాబాద్​ మాసబ్​ట్యాంకులోని ఉన్నత విద్యామండలి ఎదుట ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించి... ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే రుసుములపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ జరుగుతున్నా..... ఫీజుల నియంత్రణ కమిటీ ఛైర్మన్​ను నియమించకపోవడం సరైందని కాదని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి వచ్చి కార్యకర్తలకు నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు. కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలు రుసుం పెంచుతూ తీసుకున్న విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్తామని పాపిరెడ్డి తెలిపారు.

ఉన్నత విద్యామండలి ఎదుట ఎస్​ఎఫ్ఐ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details