ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాల అప్పగింత కొనసాగుతోంది. సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను కొన్నింటిని ఇవాళ తెలంగాణకు అప్పగించారు. కే బ్లాక్‌తో పాటు నార్త్ హెచ్ బ్లాకుల అప్పగింత పూర్తైంది. సంబంధిత భవనాలను అప్పగిస్తూ ఏపీ అధికారి రవిబాబు తెలంగాణ సాధారణ పరిపాలనా శాఖ అధికారి చిట్టిరాణికి పత్రాలు అందించారు. మిగతా భవనాలను రేపు అప్పగిస్తామని తెలిపారు.
కొనసాగుతున్న సచివాలయ అప్పగింతలు - ap tg relations
భవనాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని భవనాల అప్పగింత పూర్తైంది. మిగతా భవనాలకు సంబంధించిన ప్రక్రియ రేపు కొనసాగనుంది.
secretariat