సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈనెల 23న విడుదల చేయనున్నట్లు సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 24 సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ప్రవేశాల కోసం మార్చి 31న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. సొసైటీ పరిధిలోని ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ఫిబ్రవరి 17న నిర్వహించిన పరీక్ష ఫలితాలను 27న ప్రకటించనున్నారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 31లోగా ధ్రువపత్రాలతో కళాశాలల్లో రిపోర్టు చేయాలని.. లేకపోతే ప్రతిభ ఆధారంగా ఇతర విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల వివరాలు వెబ్సైట్లో పొందుపర్చామన్నారు. అభ్యర్థులు ఈనెల 25లోగా కాలేజీలో చేరాలని సూచించారు. ఒకేషనల్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ తేదీ, ప్రదేశం, ఇతర వివరాలను వెబ్సైట్ ద్వారా త్వరలో వెల్లడిస్తామన్నారు.