తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఐదు నెలలైనా చెక్ పవర్ ఇవ్వరా..! - చెక్ పవర్ కోసం సర్పంచ్​ల నిరసన

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశంలో మండలంలో సర్పంచ్​లు నిరసనకు దిగారు. తాము గెలిచి ఐదు నెలలు గడుస్తున్నా చెక్​ పవర్​ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చెక్ పవర్ కోసం సర్పంచ్​ల నిరసన

By

Published : Jun 11, 2019, 5:04 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​లోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్​లు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశం మధ్యలో సర్పంచులు పోడియం ముందు బైఠాయించారు. తాము గెలిచి ఐదు నెలలు అవుతున్నా తమకు చెక్​పవర్​ ఇవ్వకపోవడం వల్ల గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని నిరసన తెలిపారు. ప్రభుత్వం త్వరగా చెక్​ పవర్​ కల్పించాలని వారందరు కోరారు. ప్రస్తుత ఎంపీపీ, ఎంపీటీసీల ఐదు సంవత్సరాల కాలం ముగిసినందున వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

చెక్ పవర్ కోసం సర్పంచ్​ల నిరసన

ABOUT THE AUTHOR

...view details