టాలీవుడ్లోని బ్యాచిలర్ హీరోలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే నిఖిల్ ఓ ఇంటివాడవగా.. రానా, నితిన్ త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మిగతా బ్యాచిలర్ కథానాయకుల పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొంతమంది నవ్వుతూ, మరికొంతమంది ఏదో సాకు చెప్పి దీని నుంచి తప్పించుకుంటున్నారు. ఇదే విషయమై మాట్లాడిన సందీప్ కిషన్.. కొన్ని లక్షణాలు చెప్పి, అటువంటి అమ్మాయి మెడలోనే తాళి కడాతనని అన్నాడు.
ఇందులో భాగంగా చురుకుదనం, తెలివి, దృఢంగా, స్ఫూర్తినిచ్చే తత్వం కలగలపిన లక్షణాలు ఉన్న యువతి మెడలోనే మూడు ముళ్లు వేయాలనుకుంటున్నట్లు సందీప్ చెప్పుకొచ్చాడు.