దబాంగ్, దబాంగ్ 2 చిత్రాలతో ఆకట్టుకున్న సల్మాన్ ఖాన్.. ఇదే సిరీస్లో మూడో సినిమా 'దబాంగ్-3'ని ప్రారంభించాడు. నేటి నుంచి మధ్య ప్రదేశ్లో షూటింగ్ జరుపుకుంటోంది. సల్మాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇంతకుముందు వచ్చిన దబాంగ్ను అభినవ్ కశ్యప్, దబాంగ్-2ను అర్భాజ్ ఖాన్ తెరకెక్కించారు.
దక్షిణాది చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేసి దర్శకుడిగా ఆకట్టుకున్నాడు ప్రభుదేవా. 2009లో సల్మాన్ హీరోగా 'వాంటెడ్' పేరుతో తెరకెక్కించిన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. తెలుగులో హిట్ అయిన 'పోకిరి'కి ఇది రీమేక్.