'ఏక్ థా టైగర్'కు కొనసాగింపుగా వస్తున్న మూడో సినిమాలో సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ కలిసి నటించబోతున్నట్టు ఊహాగానాలొస్తున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ ఇటీవల సౌదీ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న సల్మాన్...టైగర్ సిరీస్ నుంచి మరో సినిమా రానుందని సంకేతాలిచ్చాడు. చిత్రబృందం ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఈ సినిమాలోనూ కత్రినానే హీరోయిన్గా నటిస్తుందని తెలిపాడు సల్లూ భాయ్. వీరిద్దరూ ఆన్ స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ అభిమానులను అలరిస్తుంటారు. ప్రస్తుతం 'భారత్'లో కలిసి నటిస్తున్నారు.