ఇటీవలే 'చిత్రలహరి' సినిమాతో విజయాన్ని అందుకున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. తాజాగా తన మంచి మనసుతో ప్రేక్షకుల హృదయాలు గెల్చుకున్నాడు. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్ చిత్రం 'అవెంజర్స్ ఎండ్‌గేమ్'. ఈ సినిమాను అనాథ పిల్లలకు ఉచితంగా చూపించాడు సాయిధరమ్. వారికోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ హీరో అని నిరూపించుకున్నాడీ కథానాయకుడు.
అభిమానుల మనసు గెలిచిన మెగా హీరో - sai dharam tej
అనాథ పిల్లల కోసం మెగాహీరో సాయిధరమ్ తేజ్ 'అవెంజర్స్ ఎండ్ గేమ్' సినిమాను ఉచితంగా వీక్షించేందుకు ఏర్పాటు చేశాడు.
సాయి
తన స్నేహితుడు, సోదరుడితో కలిసి ఈ మంచి పని చేసినందుకు సంతోషంగా ఉందని అన్నాడు సాయిధరమ్ తేజ్. సినిమా అనంతరం పిల్లలకు మొక్కలను పంపిణీ చేసి వారికి పర్యావరణ బాధ్యతనూ తెలియజేశాడు.
ఇవీ చూడండి.. మారుతితో సాయిధరమ్ తేజ్ సినిమా?