ఈ ఏడాది అభిమానులెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో తొలి వరుసలో ఉంది 'సాహో'. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళంలో ఏకకాలంలో దీన్ని రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జపాన్‌లోనూ సినిమా విడుదల చేయనున్నారు.
ప్రచారంలో భాగంగా త్వరలో జపాన్‌లో పర్యటించనుంది చిత్రబృందం. ఇంతకు ముందు అక్కడ విడుదలైన 'బాహుబలి' తెలుగువారికే కాకుండా జపానీయులకు తెగనచ్చేసింది. ఈ కారణంతోనే 'సాహో'ను అక్కడ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.