డోపింగ్ ఆరోపణలతో రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించింది అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా). ఒలింపిక్స్ సహా ఇతర ఏ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా వేటు వేసింది. అయితే ఈ నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా అప్పీల్ చేయాలని.. రష్యా యాంటీ డోపింగ్ ఏజెన్సీ(రసాడా) నిర్ణయించింది.
స్విట్జర్లాండ్లోని లుసానే స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టులో వాడా నిర్ణయంపై అప్పీల్ చేయనుంది రసాడా. ఇందుకోసం సమావేశమై ఈ అంశంపై చర్చించనుంది. ఈనెల 10న వాడా, రష్యాపై వేటు వేయగా.. డోపింగ్ నిరోధక సంస్థ నిర్ణయాన్ని సవాల్ చేస్తామని అప్పుడే చెప్పారు ఆ దేశ అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్.