తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బంగాల్​ ప్రతిష్టను మసకబార్చారు: మోదీ - modi

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నో ఏళ్ల రాష్ట ప్రతిష్టను మసకబార్చారని దీదీపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మమతపై విరుచుకుపడిన మోదీ

By

Published : Feb 8, 2019, 9:36 PM IST

మమతపై విరుచుకుపడిన మోదీ
బంగాల్​ జలపాయ్​గుడిలో భాజాపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ.

కళలు-సంస్కృతికి నిలయమైన బంగాల్​లో హింస గురించి చర్చించుకునే దీన స్థితి ఏర్పడిందని మోదీ ఆరోపించారు. దీనికి కారణం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ​ వైఫల్యమేనని విమర్శించారు ప్రధాని.

దేశ చరిత్రలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి స్థాయి నేత అవినీతిపరులకు అండగా ధర్నా చేపట్టారని తీవ్ర ఆరోపణ చేశారు మోదీ.

శారదా కుంభకోణంతో సంబంధమున్న ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు.

"పశ్చిమ బంగ ప్రభుత్వం ఈ పవిత్ర నేలను అగౌరవ పరిచింది. ప్రజలను నిస్సహాయులను చేసింది. కళలు-సంస్కృతికి నిలయం పశ్చిమ బంగ. కానీ నేడు రాష్ట్రంలో జరుగుతోన్న హింస, అవినీతిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశ చరిత్రలోనే తొలిసారి ముఖ్యమంత్రి స్థాయి నేత ప్రజాధనాన్ని దోచుకున్న అవినీతిపరుల తరఫున ధర్నా చేపట్టారు. శారదా కుంభకోణంలో ఎవ్వరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్లను కటకటాల వెనక్కి పంపిస్తా." -నరేంద్ర మోదీ, ప్రధాని

ABOUT THE AUTHOR

...view details