రాజ్యసభ రెండు గంటల వరకు వాయిదా - నిరసన
ప్రతిపక్షాల నిరసనల మధ్య మధ్యాహ్నం రెండు గంటల వరకు సభ వాయిదా పడింది.
మధ్యాహ్నం రెండు గంటల వరకు రాజ్యసభ వాయిదా
అనంతరం సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కు తగ్గలేదు. విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ విధానంపై సుప్రీం కోర్టులో పునర్విచారణ వ్యాజ్యం వేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఆయన ప్రసంగంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. ఎస్పీ, బీఎస్పీ సభ్యులు నినాదాలు చేశారు. ఆ గందరగోళం మధ్యే సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్.