మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల హీరోయిన్గా నటిస్తున్న సినిమా సుర్యాకాంతం. ఇందులో 'పో పోవే' అంటూ సాగే పాట విడుదలైంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్ హీరోగా కనిపించనున్నాడు. మరో కథానాయికగా పర్లిన్ నటించింది.
నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ కథానాయకుడు వరుణ్‌తేజ్ సమర్పిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతమందించారు. ముద్దపప్పు వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న ప్రణీత్ బ్రహ్మండపల్లి దర్శకత్వం వహించారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.