మధ్యప్రదేశ్‌లోని దిండోరాం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుల్, అత్యాచార కేసు నిందితుడు మృతి చెందారు. కేసు దర్యాప్తు కోసం బిహార్ వెళ్లిన ఎస్సై రవీందర్ నాయక్, కానిస్టేబుల్ తులసీరాం, మహిళా కానిస్టేబుల్ లలిత... నిందితుడు రమేశ్ నాయక్‌ను అరెస్ట్ చేసి తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో కారు టైరు ఊడిపోయి ప్రమాదం జరిగింది. వాహనమంతా నుజ్జునుజ్జు అయ్యింది. కానిస్టేబుల్ తులసీరాంతోపాటు నిందితుడు రమేశ్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందగా ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.
మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ కానిస్టేబుల్ మృతి - road accident in mp
మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కానిస్టేబుల్, అత్యాచార కేసు నిందితుడు మరణించారు. వారితోపాటు వెళ్లిన ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దర్యాప్తు నిమిత్తం బిహార్ వెళ్లి తిరిగి వస్తుండగా కారు టైరు ఊడిపోయినందున ఈ ఘటన జరిగింది.
రోడ్డు ప్రమాదంలో తెలంగాణ కానిస్టేబుల్ మృతి
మృతుని కుటుంబానికి సీపీ సంతాపం
తులసీరాం భౌతికకాయాన్ని ఇవాళ హైదరాబాద్‌కు తరలించనున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌లో పనిచేస్తున్న తులసీరాం మృతి పట్ల సైబరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని సీపీ స్పష్టం చేశారు.
Last Updated : Jun 12, 2019, 12:41 PM IST
TAGGED:
road accident in mp