ఏపీలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కైగల్ వద్ద ఈ తెల్లవారు జామున ఓ కంటైనర్ వంతెన అంచుకు దూసుకెళ్లింది. కంటైనర్ అడ్డంగా ఆగిపోవడం వల్ల పలమనేరు-కుప్పం జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం పోలీసులు ప్రత్యామ్నాయంగా కర్ణాటక రహదారి మీదుగా వాహనాలను మళ్లించారు. ప్రమాదానికి గురైన కంటైనర్ తమిళనాడులోని హోసూరు నుంచి రాజస్థాన్ వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. చోదకుడు నిద్రమత్తులో ఉండడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కంటైనర్ వంతెన అంచున ఆగడం వలన డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు.
వంతెన అంచున కంటైనర్... గాల్లో ప్రాణాలు... - ప్రమాదం
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కైగర్ వద్ద కంటైనర్ అదుపుతప్పి వంతెన అంచున నిలిచింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వేగంగా వచ్చిన కంటైనర్ వంతెన అంచున ఆగడం వలన చోదకుడు ఊపిరి పీల్చుకున్నాడు.
వంతెన అంచున కంటైనర్