తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం" - mp revanth reddy

ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తనకు ఇచ్చిన హోదాను బాధ్యతగా నిర్వర్తిస్తానని,  ప్రజా సమస్యల పట్ల పార్లమెంట్​లో పోరాడతానని తెలిపారు.

"ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడితే రాజ్యం"

By

Published : Jun 11, 2019, 9:53 AM IST

Updated : Jun 11, 2019, 12:00 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ అనాలోచిత విధానాలతో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి 12 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్న కేసీఆర్​కు వచ్చే ఎన్నికల్లో ఆ 12 మందే మిగులుతారని జోస్యం చెప్పారు. కంటోన్మెంట్​ మహేంద్రహిల్స్​ కాలనీలో కాంగ్రెస్​ నేత ఆర్టీసీ మాజీ ఛైర్మన్​ సంజీవ రెడ్డి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. మల్కాజిగిరి పార్లమెంట్​ పరిధిలోని ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాటిచ్చారు. నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.

"ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం"
Last Updated : Jun 11, 2019, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details