తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే: రేవంత్​రెడ్డి - loksaba

లోక్​సభ ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని రేవంత్​ రెడ్డి అన్నారు. మాల్కాజిగిరి పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్​ అభ్యర్థి రేవంత్​రెడ్డి

By

Published : Mar 21, 2019, 5:31 AM IST

Updated : Mar 21, 2019, 7:38 AM IST

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా మధ్యే పోటీ ఉంటుందన్నారు మల్కాజిగిరి పార్లమెంట్​ అభ్యర్థి రేవంత్​రెడ్డి. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు కలిగేలా మోదీ, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో మోదీని ఓడించాలంటే కాంగ్రెస్​కు ఓటు వేయాలని... గులాబీ పార్టీకి ఓటు వేస్తే అది భాజపాకు వేసినట్లేనన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో రేవంత్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కూకట్​పల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్​ అభ్యర్థి రేవంత్​రెడ్డి
Last Updated : Mar 21, 2019, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details