అప్రజాస్వామిక విధానాలతో నియంతలా వ్యవహరిస్తూ... దాడులతో ప్రతిపక్ష పార్టీలను బెదిరిస్తున్నారంటూ సీఎం కేసీఆర్పై ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. ఖమ్మంలోని ఓ హోటల్లో తమ బంధువులు బస చేసిన గదులపై దాడులు చేశారని... మహిళలని చూడకుండా ఇష్టానుసారం వ్యవహరించారని విమర్శించారు. ఖమ్మం లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి దాడులపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల పరిశీలకులకు కూడా తెలియజేయనున్నట్లు వెల్లడించారు. ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రేణుకా ఆరోపించారు. తను ఎవరి బెదిరింపులకు భయపడనని చెప్పారు.
ఎన్నికల అధికారికి రేణుకా చౌదరి ఫిర్యాదు
ఖమ్మంలోని ఓ హోటల్లో తమ బంధువులు బస చేసిన గదులపై దాడులు చేశారని... మహిళలనే గౌరవం లేకుండా ప్రవర్తించారంటూ ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
ఖమ్మంలో మాట్లాడుతున్న రేణుకా చౌదరి