తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రెండో రోజూ ఈడీ విచారణకు వాద్రా - money laundering case

హవాలా కేసు విచారణకు వరుసగా రెండో రోజూ ఈడీ కార్యాలయానికి రాబర్ట్​ వాద్రా హాజరయ్యారు. దాదాపు 2 గంటలపాటు వాద్రాను ఈడీ ప్రశ్నించింది.

రెండో రోజూ ఈడీ కార్యాలయానికి రాబర్ట్​ వాద్రా హాజరయ్యారు

By

Published : Feb 7, 2019, 1:52 PM IST

Updated : Feb 7, 2019, 3:19 PM IST

రెండో రోజూ ఈడీ కార్యాలయానికి రాబర్ట్​ వాద్రా హాజరయ్యారు
హవాలా కేసు విచారణకు వరుసగా రెండో రోజూ ఈడీ కార్యాలయానికి రాబర్ట్​ వాద్రా హాజరయ్యారు. దాదాపు 2 గంటలపాటు వాద్రాను ఈడీ ప్రశ్నించింది.

రెండో రోజూ ఈడీ కార్యాలయానికి రాబర్ట్​ వాద్రా హాజరయ్యారు

విదేశాల్లో స్థిరాస్తులు, ఇతర లావాదేవీలపై రాబర్ట్​వాద్రా వరుసగా రెండో రోజూ ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న ఆరుగంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు నేడూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్​ సహా ఏడుగురు సభ్యుల బృందం వాద్రాను ప్రశ్నించింది. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం కింద నిన్న వాద్రా వాంగ్మూలాన్ని రికార్డు చేశారు అధికారులు. రెండో రోజు విచారణకు ఉదయమే ఈడీ ముందు హాజరయ్యారు వాద్రా. దాదాపు 2 గంటలపాటు వాద్రాను ఈడీ విచారించింది. కాసేపు విశ్రాంతి అనంతరం మళ్లీ ప్రశ్నించనుంది.

అసలు కేసు దేని గురించి..?

రాబర్ట్ వాద్రా లండన్​లో 1.9మిలియన్​ పౌండ్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారన్నది ఆరోపణ. ఇందుకోసం అక్రమ నగదు బదిలీకి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఈడీ ఇప్పటికే అనేక చోట్ల సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించింది.

అక్రమాస్తుల కేసులో గతవారం వాద్రాకు దిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది. ఈడీ విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో మొదటి సారి దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హజరయ్యారు వాద్రా.

Last Updated : Feb 7, 2019, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details