రాజస్థాన్లోని బికనేర్ జిల్లా భూ కుంభకోణం విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట రెండో రోజు విచారణకు హాజరయ్యారు. బుధవారం ఉదయం భారీ భద్రత నడుమ జైపూర్లోని ఈడీ జోనల్ కార్యాలయానికి చేరుకున్నారు.
మంగళవారం వాద్రాతో పాటు హాజరైన ఆయన తల్లి మౌరీన్ను కొంత సమయం విచారించిన తర్వాత ఈడీ కార్యాలయం నుంచి వెళ్ల్లేందుకు ఆనుమతించారు. రాబర్ట్ వాద్రాను మాత్రం 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.