తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'నేను చౌకీదార్​ కావడానికి కారణమదే' - SUSHMA

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ ఆమె ట్విట్టర్​ ఖాతాలో పేరుకు ముందు చౌకీదార్ జోడించారు. ఈ విషయంపై ఓ నెటిజన్​ ప్రశ్నించగా..విదేశాంగ మంత్రి వెనువెంటనే తెలివిగా బదులిచ్చారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నెటిజన్​ ప్రశ్నకు విదేశాంగ మంత్రి దీటైన జవాబు

By

Published : Mar 31, 2019, 6:55 AM IST

నెటిజన్​ ప్రశ్నకు విదేశాంగ మంత్రి దీటైన జవాబు
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌లో చురుగ్గా ఉంటారు. విదేశాల్లో ఎవరైనా భారతీయులు చిక్కుల్లో ఉంటే ట్విట్టర్ వేదికగానే పరిష్కారం చూపుతారు. ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన ‘మై బీ చౌకీదార్‌’ ప్రచారంలో భాగంగా ఆమె ట్విట్టర్‌ ఖాతాలో తన పేరుకు ముందు చౌకీదార్‌ పదాన్ని జోడించారు.

ఈ విషయంపై ఓ నెటిజన్‌ సుష్మాస్వరాజ్​ని ప్రశ్నించాడు.

‘మేడమ్, మీరు మా విదేశాంగ మంత్రని భావిస్తున్నాం. భాజపాలో తెలివైన వ్యక్తి. మిమ్మల్ని మీరు చౌకీదార్ అని ఎందుకు పిలుచుకుంటున్నారు?’ అని ట్వీట్ చేశాడు. సుష్మా స్వరాజ్​ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

‘ఎందుకంటే, అంతర్జాతీయంగా భారత ప్రయోజనాలు, భారతీయుల కోసం చౌకీదారీ చేస్తున్నాను’ అని బదులిచ్చారు. ఈ జవాబుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details