తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఏపీలో 5 కేంద్రాల్లో 6న రీపోలీంగ్: ఈసీ - guntur

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనల దృష్ట్యా... ఆంధ్రప్రదేశ్​లోని 5 కేంద్రాల్లో రీపోలీంగ్ చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. ఈ నెల 6న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్రకటన జారీచేసింది.

ec

By

Published : May 2, 2019, 7:14 AM IST

ఏపీలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 5 చోట్ల రీపోలింగ్​కు ఈసీ నిర్ణయించింది. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని కేసానుపల్లి 94వ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువు 244వ కేంద్రం, నెల్లూరు నియోజకవర్గం పల్లెపాలెం ఇసుకపల్లి 41వ కేంద్రం, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకానితిప్ప 197వ కేంద్రం, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతల 247వ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు... ఈ నెల 6న ఈ 5 కేంద్రాల్లో మరోసారి ఎన్నిక జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఈసీ నుంచి ఆదేశాలు అందాయి.

ABOUT THE AUTHOR

...view details