అధికార పార్టీలో చేరితేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందంటే.. జాతీయ స్థాయిలో తెరాస ఎంపీలు కూడా అధికారపార్టీలో చేరాలి కదా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి ప్రశ్నించారు. సీఎల్పీని తెరాసలో విలీనం చేస్తూ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదులు పట్టించుకోకుండా విలీనాన్ని స్వాగతించడం సరికాదన్నారు.
"విలీనాల్లోనూ తెరాస ప్రభుత్వం రికార్డు సృష్టించింది" - తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి
ఐదేళ్లలో ఏడు విలీనాలు చేపట్టి తెరాస ప్రభుత్వం రికార్డు సృష్టించిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయడం మంచిది కాదన్న రావుల.. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు.
!["విలీనాల్లోనూ తెరాస ప్రభుత్వం రికార్డు సృష్టించింది"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3497126-407-3497126-1559907561922.jpg)
"విలీనాల్లోనూ తెరాస ప్రభుత్వం రికార్డు సృష్టించింది"
"విలీనాల్లోనూ తెరాస ప్రభుత్వం రికార్డు సృష్టించింది"
ఇదీ చూడండి : నాగర్కర్నూల్ జిల్లా తెరాసలో వర్గపోరు... ఘర్షణ