తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'83' కోసం రణ్​వీర్ ప్రాక్టీస్​ షురూ - కపిల్ దేవ్

1983లో తొలిసారిగా భారత్ ప్రపంచకప్ గెలిచింది. ఇప్పుడు అదే కథాంశంతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో కపిల్ దేవ్ పాత్ర కోసం రణ్​వీర్ శిక్షణ మొదలు పెట్టేశాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

'83' కోసం రణ్​వీర్ సింగ్ ప్రాక్టీసు మొదలు

By

Published : Apr 5, 2019, 8:58 AM IST

బాలీవుడ్ హీరో రణ్​వీర్ సింగ్ 1983 క్రికెట్ ప్రపంచకప్​ నేపథ్యంతో వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. దానికి సంబంధించిన ప్రాక్టీసులో పాల్గొంటున్నాడు. ఇందులో కపిల్ పాత్ర పోషిస్తున్న రణ్​వీర్.. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల స్టేడియంలో శిక్షణ మొదలు పెట్టేశాడు. దీనికి '83' భారత జట్టు సభ్యులు కపిల్ దేవ్​ తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు ఆ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

స్టేడియంలో అభిమానులతో కలిసి సందడి చేశాడు రణ్​వీర్. కొందరికి అతడితో సెల్ఫీలు తీసుకునే అదృష్టమూ దక్కింది.

ఈ సినిమా మే15 నుంచి షూటింగ్ జరుపుకోనుంది. అందుకే చిత్రబృందం మొత్తం ప్రాక్టీసులో మునిగి తేలుతున్నారు. కబీర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రం తర్వాత కరణ్ జోహర్ తెరకెక్కిస్తున్న 'తఖ్త్' సినిమాలో నటించనున్నాడీ హీరో. కరీనా కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details