తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రామ్​చరణ్ కొత్త లుక్ షేర్ చేసిన వరుణ్​తేజ్

సామాజిక మాధ్యమాల్లో వరుణ్​తేజ్ పంచుకున్న ఓ ఫొటో అభిమానులను ఖుషీ చేస్తోంది. అల్లూరిగా రామ్​చరణ్ లుక్ ఇదేనా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

By

Published : Mar 23, 2019, 1:13 PM IST

హీరో రామ్​చరణ్

మెగాపవర్ స్టార్ రామ్​చరణ్ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' లో అల్లూరి సీతరామరాజుగా నటిస్తున్నాడు. లుక్ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు... వరుణ్​తేజ్ ట్వీట్ చేసిన ఫొటో ఆసక్తి కలిగిస్తోంది. చరణ్ కొత్త లుక్​లో కనిపిస్తున్నాడు. అల్లూరి గెటప్ ఇదేనా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ట్విట్టర్​లో వరుణ్ తేజ్ పంచుకున్న ఫొటో

మరో హీరోగా ఎన్టీఆర్ 'కొమురం భీం' పాత్రలో కనిపించనున్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న ఈ సినిమా విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details