చాలా రోజుల విరామంతో తర్వాత మళ్లీ కెమేరా ముందుకు రానున్నాడు యువ నటుడు రాజ్‌తరుణ్. అతడు హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వి.విజయేంద్ర ప్రసాద్ క్లాప్ కొట్టగా.. ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు మనవడు మాస్టర్ ఆరాన్ష్ గౌరవ దర్శకత్వం వహించారు.
'ఇద్దరి లోకం ఒకటే' అంటున్న రాజ్‌తరుణ్ - రాజ్‌తరుణ్
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు జి.ఆర్.కృష్ణ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది.
'ఇద్దరి లోకం ఒకటే' అంటున్న రాజ్‌తరుణ్
"రాజ్‌తరుణ్ మా బ్యానర్‌లో చేస్తోన్న రెండో చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం...సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్నివివరాలను తెలియజేస్తాం"
-- దిల్‌రాజు, చిత్ర నిర్మాత