తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేడు నిజామాబాద్​లో ఈసీ రజత్‌ కుమార్ పర్యటన - నిజామాబాద్​

నిజామాబాద్​లో పోలింగ్ ఏర్పాట్లు ఇవాళ్టి నుంచి వేగవంతం కానున్నాయి. ఈరోజు ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. పోలింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఇందూరు కోసం సీనియర్ అధికారి రాహుల్ బొజ్జాను ప్రత్యేకాధికారిగా నియమించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్ నేడు నిజామాబాద్​లో పర్యటించి ఈవీఎంల సన్నద్ధత, పోలింగ్ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.

నేడు నిజామాబాద్​లో ఈసీ రజత్‌ కుమార్ పర్యటన

By

Published : Apr 3, 2019, 6:24 AM IST

Updated : Apr 3, 2019, 7:44 AM IST

నేడు నిజామాబాద్​లో ఈసీ రజత్‌ కుమార్ పర్యటన
చరిత్రలోనే తొలిసారిగా ఎక్కువ మంది అభ్యర్థులున్నప్పటికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నిజామాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్​లోని ఈసీఐఎల్, బెంగళూరులోని బెల్ కంపెనీలకు చెందిన ఆధునిక ఎంత్రీ ఈవీఎంలను ఇందుకోసం వినియోగిస్తున్నారు.

600 మంది ఇంజినీర్లు

ఇప్పటికే కొన్ని యంత్రాలు ఇందూరు చేరుకోగా... మిగతా యంత్రాలు ఇవాళ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. యంత్రాల మొదటి దశ తనిఖీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం 600 మంది ఇంజినీర్లు నిజామాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో అందుబాటులో ఉండనున్నారు. ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నందున అదనపు పోలింగ్ సిబ్బందితో పాటు సెక్టోరల్ అధికారులను కూడా వినియోగించనున్నారు. అటు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయి శిక్షకులతో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేకాధికారి నియామకం

కేవలం నిజామాబాద్​లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పర్యవేక్షణ కోసం ఓ అధికారిని కూడా నియమించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జాను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం నిజామాబాద్ ఎన్నిక కోసమే ఆయనకు బాధ్యతలు అప్పగించారు.

రజత్‌ పర్యటన

అటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్ కూడా నేడు నిజామాబాద్​లో పర్యటించనున్నారు. ఈవీఎంల సన్నద్ధత, పోలింగ్ ఏర్పాట్లను సీఈఓ ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. 12 బ్యాలెట్ యూనిట్లు యూ ఆకారంలో ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఇబ్బంది పడకుండా ఆ నమూనాను ఫ్లెక్సీలు, హోర్డింగ్ ల ద్వారా ప్రదర్శించేలా ఏర్పాటు చేయనున్నారు.

ఇవీ చూడండి:ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలె: కేటీఆర్​

Last Updated : Apr 3, 2019, 7:44 AM IST

ABOUT THE AUTHOR

...view details