రెండు జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి దూసుకెళ్తోంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఒక్క మ్యాచ్‌లోనే నెగ్గి మిగతా మూడింటిలో పరాజయం పాలైంది రాజస్థాన్ రాయల్స్. ఈ రెండు జట్లు జైపుర్ వేదికగా నేడు తలపడనున్నాయి.
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది కోల్‌కతా, దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది రాజస్థాన్. రసెల్ విధ్వసంతో కోల్‌కతా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 13 బంతుల్లో 48 పరుగులు చేసి పెను విధ్వంసమే సృష్టించాడు రసెల్.
బెన్ స్టోక్స్, బట్లర్ లాంటి హిట్టర్లు రాజస్థాన్ సొంతం.
కోల్‌కతా నైట్ రైడర్స్..
కోల్‌కతా జట్టులో క్రిస్‌లిన్, నితీశ్ రానా, రాబిన్ ఉతప్ప, శుభమాన్ గిల్, దినేశ్ కార్తీక్ లాంటి బ్యాట్స్‌మెన్ టాప్ఆర్డర్ బలంగా ఉంది. చివర్లో మెరుపులు మెరిపించడానికి రసెల్ ఎలాగూ ఉన్నాడు. ఇప్పటి వరకూ కోల్‌కతా గెలిచిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ రసెల్ పాత్రే కీలకం. ఓటమి అంచున ఉన్న జట్టును తన బ్యాటింగ్‌తో మాయ చేసి గెలిపిస్తున్నాడు. బౌలింగ్‌లో స్పిన్ త్రయం నరైన్, కుల్దీప్ యాదవ్, పియూష్ చావ్లాతో పటిష్ఠంగా ఉంది.
రాజస్థాన్ రాయల్స్
స్టోక్స్, బట్లర్, రహానే, స్మిత్ లతో బ్యాటింగ్ లైనప్ శక్తిమంతంగా ఉంది. సంజూ శాంసన్ జోరు మీద ఉన్నాడు. బౌలింగ్‌లో స్టోక్స్, ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్ పదునైన బంతుల విసరగల సమర్థులే. గూగ్లీ స్పెషలిస్టు శ్రేయాస్ గోపాల్ రాజస్థాన్‌కు మరో పెద్ద అస్త్రం. బెంగళూరుతో మ్యాచ్‌లో 12 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.