బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా తెలంగాణలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను సోమవారం మధ్యాహ్నాం సమయంలో తీరానికి 950 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆ శాఖ అధికారి తెలిపారు. నెమ్మదిగా కదులుతూ క్రమంగా మే నాలుగో తేదీ నాటికి ఒడిశా తీరాన్ని తాకొచ్చని అన్నారు. మరో రెండు రోజుల్లో దీని గమనంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు స్పల్పంగా తగ్గి, ఉరుములు మెరుపులతో 40 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అత్యధికంగా ఆదిలాబాద్లో 45.3, నిజామాబాద్ 45, మెదక్ 43.6 , హైదరాబాద్ 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి. వేడి తీవ్రతకు గాలిలో తేమ తగ్గడం వల్ల ఉక్కపోత పెరిగి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు
తుపాను ప్రభావం ఫలితంగా మంగళవారం నుంచి తెలంగాణలో తేలిక పాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది.
గాలిలో తేమ తగ్గడం వల్ల ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కరి