హైదరాబాద్‌లో సాయంత్రం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో వాన పడింది. రోడ్లపై నీరు నిలిచి వాహన దారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ స్తంభించి ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
రాజధానిలో వర్షం... రోడ్లపై నిలిచిన జలం - rain-in-city
'ఫొని' తుఫాను ప్రభావంతో రాజధానిలో వర్షం కురిసింది. ఒక్కసారిగా జల్లు పడటంతో అప్పటి వరకూ సెగలు కక్కిన రహదారులు... చల్లదనం పంచాయి.
పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం
ఫొని తుపాను ప్రభావంతో 3 రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: వరంగల్ జైలుకు సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి
TAGGED:
rain-in-city