తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అప్పుడు బీడీలు చుట్టారు.. ఇప్పుడు బిస్కెట్లు చేస్తున్నారు - Ragi biscuits

బీడీలు చుట్టే చేతులు ఇప్పుడు బిస్కెట్లు తయారు చేస్తున్నాయి. ఉపాధి పొందటమే కాదు... ఆరోగ్యకరమైన ఆహారాన్ని... చిన్నారులకు ఇష్టమైన పద్ధతిలో అందిస్తున్నారు ఆ మహిళలు. స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ప్రోత్సాహంతో కష్టపడి కలెక్టర్​ చేయూతను అందిపుచ్చుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రాగి బిస్కట్లను సరఫరా చేస్తూ... చిన్నారులకు ఆరోగ్యంతోపాటు తల్లిదండ్రులకు ఆనందాన్ని పంచుతున్నారు.

రాగి బిస్కెట్లు

By

Published : May 18, 2019, 5:44 PM IST

రాగి బిస్కెట్ల తయారీ

సిరిసిల్ల శివారులోని కార్మిక క్షేత్రమైన రాజీవ్​నగర్​లో బీడీలు చుట్టడం ఇక్కడి మహిళల ప్రధాన ఉపాధి. బీడీ కార్మికులకు ఆరోగ్యకరమైన ఉపాధి కల్పించాలనే ఆలోచనతో వాసన్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. పేద పిల్లలకు పోషకాహారాన్ని అందించాలన్న లక్ష్యంతో... రాగసుధ మహిళా సంఘానికి రూ.లక్షతో బిస్కెట్ల తయారీకి మర యంత్రం, సామాగ్రి అందించింది. వీరి కృషిని అభినందించిన జిల్లా పాలనాధికారి వెంకట్రామిరెడ్డి​... వ్యాపార నిర్వహణకు రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. కలెక్టర్ చేయూతతో రాగి బిస్కెట్లు తయారు చేసి ఉపాధి పొందుతున్నారు.

పిల్లల మనసు దోచుకున్న రాగి బిస్కెట్లు

చిన్నారులకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని బిస్కెట్ల రూపంలో ఇవ్వటం వల్ల ఇష్టంగా తింటున్నారని అంగన్వాడీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ రాగి బిస్కెట్లను ఇంట్లో తయారు చేయటం కష్టమని... ఈవిధంగా అందించటం తమకు సంతోషంగా ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన రాగి బిస్కెట్లను సిరిసిల్లలోని 50 అంగన్వాడీ కేంద్రాలోని 714 మంది చిన్నారులకు 2018 ఆగస్టు నుంచి సరఫరా చేస్తున్నారు. ఇటు ఉపాధి, అటు చిన్నారుల్లో ఆరోగ్యాన్ని పెంచటం తమకు సంతృప్తిగా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి: అక్షరాలే చిత్రాలైతే... ఆ కళాఖండాలే కథలైతే!

ABOUT THE AUTHOR

...view details