తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'ఆ హీరోలతో సినిమా చేయడం నా కల' - ragava lawrence said my dream is to direct chiranjeevi and nagarjuna

చిరంజీవి, నాగార్జునలతో సినిమా చేయాలనేది తన కల అంటూ మనసులో మాట చెప్పుకొచ్చాడు కొరియోగ్రాఫర్​, నటుడు రాఘవ లారెన్స్.

రాఘవ లారెన్స్

By

Published : Mar 28, 2019, 8:31 PM IST

'ముని' సిరీస్​లో వస్తున్న నాలుగో చిత్రం ‘కాంచన 3’. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి... దర్శకత్వం వహించాడులారెన్స్. ఈ చిత్ర ట్రైలర్​ విడుదల కార్యక్రమం నేడు జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జునలతో సినిమా చేయాలని ఉందంటూ మనసులో మాటను బయటపెట్టాడు రాఘవ లారెన్స్​.

ఇదీ చదవండి: కాంచన ట్రైలర్​తో భయపెట్టేసిన లారెన్స్

తనను పెద్ద డాన్స్ మాస్టర్ని చేసిన మెగాస్టార్ చిరంజీవితో, ‘మాస్’ తో డైరెక్టర్​గా అవకాశమిచ్చిన కింగ్ నాగార్జునతో మరో సినిమా డైరెక్ట్ చేయాలనేది తన కల అని చెప్పుకొచ్చాడు.

వేదిక, ఓవియా హీరోయిన్లుగా నటించిన కాంచన-3 సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details