తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జైశంకర్​కు పాకిస్థాన్​​ విదేశాంగ మంత్రి లేఖ

విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​కు పాక్​ మంత్రి మహమూద్ ఖురేషీ లేఖ రాశారు. ఇరు దేశాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి పాక్​ సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు.

జైశంకర్​కు పాకిస్థాన్​​ విదేశాంగ మంత్రి లేఖ

By

Published : Jun 7, 2019, 10:12 PM IST

విదేశాంగ శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జైశంకర్​కు పాకిస్థాన్​ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి మహమూద్​ ఖురేషి లేఖ రాశారు. భారతదేశంతో అన్ని ప్రాధాన్య అంశాలను చర్చించడానికి పాకిస్థాన్​ సిద్ధంగా ఉన్నట్లు ఖురేషీ తెలిపారు. ఉపఖండంలో శాంతి స్థాపనకు పాక్ కట్టుబడి ఉందని లేఖలో పేర్కొన్నారు.
భారత విదేశీవ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయశంకర్​కు ఖురేషీ శుభాకాంక్షలు తెలిపారు.

"భారత్​తో అన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించాలని పాకిస్థాన్ కోరుకుంటోంది. ఉపఖండంలో శాంతి స్థాపనకు పాక్ కట్టుబడి ఉంది." - షా మహమ్మద్ ఖురేషీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి.

కలిసి పనిచేద్దాం..

దాయాది దేశాల మధ్య తెగిపోయిన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు కృషిచేద్దామని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ ఇప్పటికే మోదీకి ప్రతిపాదించారు. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన, అభివృద్ధికి కలిసి పనిచేయడానికి ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

జమ్ముకశ్మీర్ పుల్వామాలో పాక్​ ఆధారిత జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ ఫిబ్రవరిలో జరిపిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్ఫీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అనంతరం బాలాకోట్​లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానికదళం దాడి చేసింది. అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఇదీ చూడండి: వయనాడ్​లో రాహుల్ 'కృతజ్ఞతా' పర్యటన​

ABOUT THE AUTHOR

...view details