మొహాలీ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ జట్టు ఓపెనర్ రాహుల్ 71 పరుగులతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇదే మ్యాచ్‌లో గేల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 300 సిక్స్‌లు కొట్టిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
పంజాబ్ టాప్ మెరిసింది
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు గేల్, రాహుల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 53 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గేల్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
గేల్ సిక్సర్ల రికార్డు..
ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో 300 సిక్స్‌లు కొట్టిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం 302 సిక్స్‌లతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో మాయంక్ 43, మిల్లర్ 13 పరుగులు చేశారు.