మొహాలీ వేదికగా ఈ రోజు పంజాబ్, ముంబయి జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబయి సిద్ధమవుతోంది.
వివాదాల జట్లు...
రెండు జట్లు వివాదాలతోనే తొలి మ్యాచుల్లో విజయం సాధించాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నోబాల్ ఇవ్వకపోవడం ద్వారా ముంబయి గెలిస్తే.... మన్కడింగ్ వివాదంతో పంజాబ్ జట్టు గెలిచింది.
జట్లు (అంచనా)
ముంబయి ఇండియన్-- రోహిత్ శర్మ(కెప్టెన్), బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, డికాక్ (వికెట్ కీపర్), మయాంక్ మార్కండే, మెక్లెనగన్, పొలార్డ్, యువరాజ్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, మలింగ
కింగ్స్ ఎలెవన్ పంజాబ్-- రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), మహ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్‌గేల్, కే ఎల్ రాహుల్, ఆండ్రూ టై,మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్, ముజీబర్ రెహమాన్, డేవిడ్ మిల్లర్, మురుగన్ అశ్విన్